లాక్ డౌన్ నిబంధనలు లెక్క చేయకుండా రహదారులపై రాత్రివేళ నడుస్తూ వెళ్తున్నవారిని అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు. పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ పురం, శివనగర్ ప్రాంతాల్లో ఇలాంటి పాదచారులను గుర్తించారు.
ముందుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారికి డీఎస్పీ రమాకాంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో మార్పు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కరోనాపై అవగాహన కలిగిస్తామన్నారు.