అనంతపురం జిల్లా హిందూపురం వచ్చి... చిరు వ్యాపారాలైన పానీ పూరి, ఐస్ క్రీమ్ వంటి చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ... జీవనం సాగించేవారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది కూలీలు స్వస్థలానికి వెళ్ళే దారి లేక నానా అవస్థలు పడుతూ హిందూపురం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమకు తినడానికి తిండి ఇవ్వాలని... లేకపోతే సొంత స్థలాలకు వెళ్లేందుకు మార్గం చూపాలని కోరుతున్నారు.
హిందూపురంలో చిరువ్యాపారుల కష్టాలు - corona news in anantapur dst
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులు తినడానికి తిండి లేక వారి సొంత గ్రామాలకు వెళ్లే దారిలేక... తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమను ఆదుకోవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
migrate labours facing problems in anantapur dst