ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడకశిర నుంచి స్వరాష్ట్రాలకు బయల్దేరిన వలస కూలీలు - immigrants in madakasira going hometown latest news

అనంతపురం జిల్లా మడకశిరలోని వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఆర్టీసీ బస్సుల్లో వారిని జిల్లా కేంద్రానికి తరలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొన్నారు.

migrants suck in madakasira town were going to their hometown
స్వస్థలాలకు బయలుదేరుతున్నవలసకూలీలు

By

Published : May 20, 2020, 8:04 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు.. వారి రాష్ట్రాలకు బయల్దేరారు. అధికారులు వారి వివరాలను సేకరించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం మడకశిర నుంచి అనంతపురానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన 20 మందిని చేర్చారు.

అక్కడి నుంచి వారి రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఈ బస్సు బయలుదేరే ముందు ఎమ్మెల్యే తిప్పేస్వామి, అధికారులు వలస కార్మికులతో మాట్లాడారు. జాగ్రత్తలు చెప్పి పంపారు.

ABOUT THE AUTHOR

...view details