అనంతపురం జిల్లాకు చెందిన వలస కూలీలు... పొట్టకూటి కోసం తిరుపతికి వెళ్లారు. వారిని సొంత ప్రాంతాలకు తరలించే క్రమంలో అధికారులు వలసదారులను మార్గ మధ్యలోనే దించేశారు. తిరుపతి నుంచి 2 ప్రత్యేక బస్సుల్లో జిల్లాకు చెందిన 26 మంది కూలీలను అనంతపురం కలెక్టరేట్లో దించాల్సిందిగా అక్కడి అధికారులు సూచించించారు. అయితే వారిని సగం దారిలోనే కదిరి వద్ద దించివేయటంతో వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలు అనంతలోనే చేయొచ్చు కదా..
కదిరిలో నిర్వహించే కరోనా పరీక్షలు అనంతలోనే చేయవచ్చు కదా అని కూలీలు ప్రశ్నించగా... అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. వలసదారుల్లో ఇద్దరు మాత్రమే కదిరి ప్రాంతవాసులు ఉన్నారు. మిగిలిన వారందరూ గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన వారే. ఇప్పటికే 40 రోజులపాటు సొంత ఊళ్లకు దూరంగా ఉన్నామని... తిరిగి పరీక్షల పేరుతో మరికొద్ది రోజులు కుటుంబాలకు దూరం చేయొద్దంటూ వలస కూలీలు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:
ఈటీవీభారత్ ఎఫెక్ట్: స్వస్థలాలకు చేరిన వలస కూలీలు