గుత్తి నుంచి మధ్యప్రదేశ్ వలస కూలీల తరలింపు - వలస కూలీలు
లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న మధ్యప్రదేశ్ వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు పంపించారు. నాలుగు బస్సుల్లో వారిని తరలించారు.

గుత్తి నుంచి మధ్యప్రదేశ్ వలస కూలీల తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 115 మంది ఇతర రాష్ట్రాల వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. వీరిని 40 రోజుల క్రితం బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్‌కు కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తుండగా గుత్తి పోలీసులు అదుపులోకి తీసుకొని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. క్వారంటైన్ సమయం ముగియటంతో వీరిని 4 బస్సుల్లో మధ్యప్రదేశ్‌కు పంపించారు.