అనంతపురం నుంచి కోల్కతా వెళ్లిన శ్రామిక్ రైలులో.. ధర్మవరం నుంచి 144 మంది బంగాల్ కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లారు. వారిని ముందుగా.. ధర్మవరం నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం రైల్వే స్టేషన్కు పంపించారు.
మార్గమధ్యంలో కార్మికులు ఆకలితో ఇబ్బంది పడకుండా వారికి భోజనం ప్యాకెట్లను సత్యసాయి సేవా సమితి లయన్స్ క్లబ్ వారు పంపిణీ చేశారు. ఆర్డీవో మధుసూదన్ జెండా ఊపి బస్సులను పంపించారు.