లాక్‌డౌన్ కారణంగా ముంబయిలో చిక్కుకుపోయిన సీమ జిల్లాలకు చెందిన వందల మంది వలస కూలీలు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ముంబయి నుంచి వచ్చిన శ్రామిక్ రైలులో వారంతా అనంతపురం జిల్లా గుంతకల్లు హనుమాన్ స్టేషన్‌లో దిగారు. కర్ణాటకకు చెందిన వారు సహా... 968 మంది కూలీలను భౌతిక దూరం, అన్ని జాగ్రత్తలతో 24 బోగీల్లో తీసుకువచ్చారు. స్క్రీనింగ్ పరీక్షల అనంతరం వారందరినీ సుమారు 50 బస్సుల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ఆయా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
సీమ జిల్లాల వలస కూలీలు స్వస్థలాలకు చేరారు - migrant labours reached their own districts from mumbai news
లాక్‌డౌన్‌తో ముంబయిలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ప్రభుత్వం స్వస్థలాలకు చేర్చింది. వీరిలో అనంతపురం, కర్నూలుతో పాటు కర్ణాటకలో బళ్లారి జిల్లాలకు చెందిన దాదాపు 968 మంది ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం వీరిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

సీమ జిల్లాల వలస కూలీలు స్వస్థలాలకు చేరారు
TAGGED:
migrant labours news