లాక్డౌన్తో బెంగళూరులో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. బెంగళూరులో కరోనా వైరస్ కేసులు అధికం అవుతుండటంతో వలస కూలీలు కాలినడకన ప్రయాణం ప్రారంభించారు. గురువారం సాయంత్రానికి వారు.. అనంతపురం జిల్లా సోమందేపల్లి చేరుకున్నారు. అక్కడ వాహనాల కోసం ఎదురుచూడగా.. వాహనాలు రాకపోవడంతో తిరిగి నడక ప్రారంభించారు. కళ్యాణదుర్గంలో రాజస్థానీ యువకులు ర్యాలీ చేశారు. లాక్డౌన్తో చిక్కుకున్న తమను స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉరవకొండలో పాత్రికేయలకు నిత్యావసరాలు పంపిణీ ..
ఉరవకొండలో పాత్రికేయులకు ఎస్ఆర్సీ సంస్థ అధినేత సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అత్యవసర విధుల్లో భాగంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులను ఆ సంస్థ ప్రతినిధులు అభినందించారు.
కదిరిలో తెదేపా నేతల ఆందోళన..
లాక్డౌన్ కాలంలో పేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తేదేపా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. బియ్యం, శనగలు పంపిణీ చేశామంటున్న ప్రభుత్వం.. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మద్యం ధరలు పెంచడం సరైన పద్ధతి కాదని సూచించారు. ప్రభుత్వం స్పందించి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.