అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నివాసముంటున్న కాశ్మీరీలు సొంత రాష్ట్రానికి వెళ్లడానికి.. స్థానికంగా ఉండే వ్యాపారి సహాయం చేశారు. ఉపాధి నిమిత్తం 20ఏళ్లుగా పుట్టపర్తిలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కాశ్మీరీలకు.. లాక్ డౌన్ కారణంగా పని లేకుండా పోయింది. వారిలో చాలా మంది సొంత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా అధికారులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన అనుమతులు రాని కారణంగా... జాప్యం జరుగుతూ వచ్చింది.
ఈ విషయం సికింద్రాబాద్‌లో ఉన్న కాశ్మీరీల సంఘం నాయకులకు తెలిసింది. తాము రైలులో పంపిస్తామని, సికింద్రాబాద్ రావాలని సూచించారు. కానీ.. పుట్టపర్తిలో ఉన్న కాశ్మీరీలకు సికింద్రాబాద్ వెళ్లేందుకు సైతం డబ్బు లేకపోవడంతో.. స్థానికంగా ఉన్న బిల్డర్ లక్ష్మీపతి స్పందించారు. వీరిని మూడు బస్సుల్లో సికింద్రాబాద్ పంపేందుకు అవసరమైన ఖర్చును భరించారు. వీరు ఆర్టీసీ బస్సుల్లో సికింద్రాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి కాశ్మీర్‌కు వెళ్తున్నారని లక్ష్మీపతి తెలిపారు.