ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం - retired teacher suicide attempt at lepakshi mandal office

పాస్ పుస్తకాలు జారీ చేసే విషయంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆ కార్యాలయం ఎదుట విశ్రాంత ఉపాధ్యాయుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

suicide attempt lepakshi mandal office
లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 16, 2021, 6:00 PM IST

పాస్ పుస్తకాలు ఇవ్వలేదని.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు సుధాకర్​రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గమనించిన కార్యాలయ సిబ్బంది అతనిపై నీళ్లు చల్లారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

రెండేళ్లుగా తిరుగుతున్నా..

రెండేళ్లుగా పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగానని అయినా ఫలితం లేదని అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, రైతు సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన పత్రాలు ఉన్నా అధికారులు పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వాపోయాడు.

ఇదీ చదవండి:కరోనా వ్యాప్తి దృష్ట్యా లేపాక్షి ఆలయం మూసివేత

ABOUT THE AUTHOR

...view details