ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ సర్పంచ్ హత్య కేసులో నిందితుడు.. ఉరేసుకుని ఆత్మహత్య! - బత్తులపల్లి మాజీ సర్పంచ్ హత్య నిందితుడి ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో మాజీ సర్పంచ్​ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతని కోసం గాలిస్తుండగా.. పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా కనిపించాడు.

suicide
మాజీ సర్పంచ్ హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

By

Published : Feb 17, 2021, 4:01 PM IST

అనంతపురం జిల్లా బత్తలపల్లి మాజీ సర్పంచి లక్ష్మీదేవి హత్య కేసులో నిందితుడైన ఆమె మరిది బాల చిన్న అప్పస్వామి.. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం గంటాపురంలో లక్ష్మీదేవిపై బాల అప్పస్వామి గొడ్డలితో దాడి చేయగా ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ క్రమంలో గంటాపురం పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతున్న మృతదేహం కనిపించింది. మృతుడిని బాల అప్పస్వామిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం లక్ష్మీదేవి హత్యకు దారితీయగా.. అనంతరం ఆమె మరిది బాల చిన్న అప్ప స్వామి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తేల్చారు. బత్తలపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details