అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎన్ఎస్పీ కొట్టాల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో సాయి కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లికి చెందిన అతను భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కదిరిలో పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పని ముగించుకుని ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - ఎన్నెస్పీ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కాసేపట్లో ఇంటికి చేరేవాడే. కానీ కారు రూపంలో అతడిని మృత్యువు వెంటాడింది. కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ఎన్ఎస్పీ కొట్టాల వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
men died in road at nsp highway in anantapur