రాష్ట్రంలో భాజాపాను బలమైన రాజకీయ శక్తిగా నిలపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా చీకటిమానిపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తనకల్లు మండలం ఎస్సీ విభాగం నాయకుడు హర్షవర్ధన్ ఆధ్వర్యంలో యాభై కుటుంబాల సభ్యులు భాజపాలో చేరారు.
భాజపాలో చేరిన యాభై కుటుంబాల సభ్యులు - tanakallu latest news
అనంతపురం జిల్లా తనకల్లు మండలం చీకటిమానిపల్లిలో యాభై కుటుంబాల సభ్యులు భాజపాలో చేరారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
భాజపాలో చేరిన సభ్యులు
నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భాస్కర్ రెడ్డి అన్నారు. యువత, ఇతర పార్టీల నాయకులు భాజాపా వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తెలిపారు.
ఇదీ చదవండి: అవస్థలు కోకొల్లలు.. అభివృద్ధిపై ఆశలు