మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతుల పెళ్లి రోజు సందర్భంగా.. అనంతపురంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో అభిమానులు వారి పేరుపై అర్చనలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తండ్రికి తగ్గ తనయుడిగా మెగా ఫ్యామిలీలో మంచి గుర్తింపును సాధిస్తున్న తమ హీరో... మరిన్ని మంచి చిత్రాలను తీయాలని అభిమానులు ఆకాంక్షించారు. పూజా కార్యక్రమంలో అభిమానులు చలపతి, చంద్రమౌళి, సురేశ్, శామీర్, జగదీశ్ పాల్గొన్నారు.