'చిన్న దోమ పెద్ద ముప్పు... వేపాకు పొగ దోమలకు సెగ' - show
చిన్న దోమ పెద్ద ముప్పు... వేపాకు పొగ దోమలకు సెగ అనే నినాదాలతో గొడుగులు చేతబట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ వినూత్న ప్రదర్శన చేపట్టారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రదర్శన
By
Published : May 16, 2019, 12:44 PM IST
వినూత్న ప్రదర్శన
జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. చిన్న దోమ పెద్ద ప్రమాదం అంటూ నినాదాలు చేస్తూ నగరంలోని ప్రధాన కూడళ్లలో గొడుగులతో ప్రదర్శన చేశారు. దోమల నుంచి కాపాడుకోవడానికి వేపాకు పొగను పెట్టాలని.. దోమతెరలను ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పించారు. వడదెబ్బకు గురికాకుండా ప్రతి వ్యక్తి నిత్యం 5 లీటర్లు నీరు తీసుకోవాలని సూచించారు. దోమల బారిన పడకుండా... వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.