ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధరలు పెంచి అమ్ముతున్న 10 దుకాణాలకు జరిమానా - corona cases in anantapur dst

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కిరాణా దుకాణాలపై తూనికలు కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. నిత్యావసర సరకులను అధిక ధరలకు విక్రయిస్తున్న 10 దుకాణాల నుంచి అపరాధ రుసుం వసూలు చేశారు.

measurements and weights officers raids on kirana shops in anantapur dst rayadurgam
measurements and weights officers raids on kirana shops in anantapur dst rayadurgam

By

Published : May 18, 2020, 6:49 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కిరాణా దుకాణాలపై తూనికలు కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. ఆన్​లైన్​లో అందిన ఫిర్యాదు మేరకు స్పందించి దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చౌక ధాన్యపు డిపోల్లోనూ తనిఖీలు చేశారు.

నిత్యావసర సరకులు అధిక ధరలకు విక్రయిస్తున్న 10 షాపులపై కేసు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేశారు. చౌక ధరల డిపోల్లో కోతలు విధిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తూనికల కొలతల అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details