ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MATKA BEETERS: ఉరవకొండలో మట్కా బీటర్ల దందా గుట్టు రట్టు - అనంతపురం జిల్లా తాజా వార్తలు

ఉరవకొండ నియోజకవర్గంలో మద్యం, మట్కా నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు గుంతకల్లు ఇంఛార్జ్ డీఎస్పీ చైతన్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ తెలిపారు.

ఉరవకొండలో మట్కా బీటర్ల అరెస్ట్
ఉరవకొండలో మట్కా బీటర్ల అరెస్ట్

By

Published : Aug 4, 2021, 8:20 PM IST

అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం, మట్కాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, విడపనకల్, ఉరవకొండ మండలాల్లో మట్కా తో పాటు మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు చేయగా భారీ సంఖ్యలో నిర్వాహకులను అరెస్టు చేశారు. మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 6.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారిలో ఆరు మంది మద్యం కేసులో అరెస్టు చేయగా..మిగిలిన వారిపై మట్కా కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేమింగ్ చట్టం ప్రకారం ఎవరైనా మట్కా ఆడిన, నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాటికి దూరంగా ఉండాలని ఆయన అన్నారు. అలాగే కర్ణాటక మద్యం అమ్మిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. వజ్రకరూర్, విడపనకల్, ఉరవకొండ ఎస్సైలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details