అనంతపురం జిల్లా కదిరిలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 20 వేలు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురూ.. పాత నేరస్తులు సుధాకర్, అనిల్, వెంకటనారాయణగా పోలీసులు గుర్తించారు.
ఆ ముగ్గురూ.. వేరు వేరు ప్రాంతాలలో మట్టా దందా నిర్వహిస్తున్నట్లు తేలిందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. సుధాకర్‌పై గతంలో రౌడీషీట్ నమోదైనట్లు తెలిపారు. సుధాకర్ నివాసంలో కర్ణాటక మధ్యాన్ని పోలీసులు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.