ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు అనంతపురంలో వైకాపా నేత మహాలక్ష్మి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డితో కలిసి ఇంటింటికీ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. నగరంలో సుమారు 2 లక్షల శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు నేతలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా 25వ డివిజన్లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు.
అనంతలో రెండు లక్షల శానిటైజర్లు పంపిణీ - sanitizers distribution news in ananthapuram
అనంతపురంలో వైకాపా నేత మహాలక్ష్మీ శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డితో కలిసి ఇంటింటికి శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నేతలు స్థానికులకు వివరించారు.
అనంతలో రెండు లక్షల శానిటైజర్లు పంపిణీ