అనంతపురం జిల్లా గుత్తి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరువ వంక, గుత్తిచెరువు, మరువ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజగా గుత్తి మండలం కొజ్జాపల్లి సమీపంలోని మరువ వంక, దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయిన రైతు శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందాడు.
గుత్తి వైపు వస్తుండగా..
చెర్లోపల్లికి చెందిన బాధితుడు గుత్తి వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వాగులో కొట్టుకుపోతున్న రాములు మృతదేహాన్ని బయటకు తీశారు.
స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలింపు..