అనంతపురం జిల్లా అమరాపురం మండలం గునేహల్లి గ్రామంలో విషాదం జరిగింది. నీటి కోసం బావికెళ్లిన వివాహిత ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ నీటి కోసమని బావికి వెళ్లగా.. ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. బావిలో నుంచి అరుపులు వినిపించటంతో స్థానికులు అప్రమత్తమై, బావి నుంచి బయటకు తీశారు. 108 అంబులెన్స్ ద్వారా ఆమెను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలికి ఆరు నెలల క్రితమే పెళ్లి అయినట్లు ఆమె తండ్రి నాగరాజు తెలిపారు. నాగమణి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పెళ్లైన ఆరు నెలలకే మృతి చెందిన మహిళ - గునేహల్లి బావిలో పడి వివాహిత మృతి న్యూస్
నీటి కోసం బావికి వెళ్లిన వివాహిత అదే బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గునేహల్లి గ్రామంలో జరిగింది. మృతురాలికి ఆరు నెలల క్రితమే వివాహం అయ్యిందనీ.. అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బావిలో పడి వివాహిత మృతి