అనంతపురం జిల్లా కదిరిలో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కదిరిపట్టణంలోని హిందూపురం క్రాస్ వద్ద నివాసం ఉండే కాంచన అనే మహిళ ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కాంచనకు ఆరు నెలల క్రితం వివాహంకాగా.... పెళ్లయినప్పటి నుంచి అత్తింటి వేధింపులు మొదలయ్యాయని మృతురాలి సోదరుడు తెలిపాడు. సర్దుకుంటారన్న ఉద్దేశంతో రెండు, మూడు సార్లు నచ్చ చెప్పి కాపురానికి పంపామని వాపోయాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య ! - కదిరి మహిళ ఆత్మహత్య
అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య