అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన వివాహిత సుమలత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి కుటుంబ సభ్యులు కదిరి ప్రాంతీయ వైద్యశాల ఎదుట హిందూపురం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. సుమలత మృతిపై వారు నల్లమాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆత్మహత్యగా కేసు నమోదు చేయడంపై ఆందోళన చేశారు.. సుమలత శరీరంపై స్పష్టంగా గాయాలు కనిపిస్తున్నా ఆత్మహత్యగా ఎలా కేసు నమోదు చేస్తారని పోలీసులను నిలదీశారు.మద్యానికి బానిసైన ఆమె భర్త సురేంద్ర రెడ్డి బలహీనతను గుర్తించి.. ఆయనకు మద్యం తాగించిన సురేంద్రరెడ్డి సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు సుమలతను హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. బంధువుల ధర్నా - అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి- బంధువుల ధర్నా
అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సుమలతని అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి కుటుంబ సభ్యులు హిందూపురం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి- బంధువుల ధర్నా
హత్యగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసేవరకు మృతదేహం తీసుకెళ్లమంటూ బైఠాయించారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇవీ చదవండి: కోడెల చిత్రపటానికి తెదేపా నేతల నివాళులు