అనంతపురం జిల్లా ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవపురంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె భర్త నాగరాజు కూడా రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇద్దరు కుమారులతో ఇంటిలో ఉంటున్నలలిత కుమారి ఉరి తాడుకు వేళాడుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్పీ రమాకాంత్, పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉండటం, గదిలో పగిలిన అద్దాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం వీఆర్వో ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి - అనంతపురం జిల్లాలో మహిళ అనుమానస్పద మృతి వార్తలు
వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత అనుమానస్పద మృతి