అనంతపురం జిల్లా ఉరవకొండలో మరో 24 గంటల్లో వివాహం చేసుకోవాల్సిన వరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధపడటమే ఇందుకు కారణం. ప్రియురాలి ఇచ్చిన ఫిర్యాదుతో వరుడ్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.
ఇదీ జరిగింది..
ఉరవకొండకు చెందిన షర్ఫుద్దీన్తో.. గుత్తికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. బంధు మిత్రులందరికీ ఆహ్వానాలు అందజేశారు. ఫంక్షన్ హాల్లో పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరో 24 గంటల్లో పెళ్లి.. సరిగ్గా అప్పుడే కథ అడ్డం తిరిగింది. వరుడి ప్రేమాయణం బయటపడింది. ప్రియురాలి ఫిర్యాదుతో.. పెళ్లి ఆగిపోయింది. మరో 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడ్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.