వాణిజ్య సముదాయ భవనం ప్రారంభం - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో 25 లక్షలతో నిర్మించిన వాణిజ్య సముదాయ భవనాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాయదుర్గం ఆర్టీసీ డిపో సందర్శించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వాణిజ్య సముదాయ భవనం ప్రారంభించిన రాయదుర్గం ఎమ్మెల్యే
.