అనంతపురం జిల్లా కదిరిలో గంజాయిని విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని జడలయ్య మండపం ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ - అనంతపురం తాజా వార్తలు
గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని చూపుతున్న పోలీసులు