విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని శాసనసభలో ఆధారాలు చూపిన ముఖ్యమంత్రి జగన్.. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మాణిక్యాలరావు సమక్షంలో పలువురు భాజపాలో చేరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు మోదీ పాలనను విశ్వసిస్తున్నారని.. అందుకే చాలామంది తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. జగన్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదా సాధిస్తామని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని.. ఇప్పుడు జగన్ అదే ధోరణిలో వెళ్తున్నారని అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పి.. కేంద్రం ఇచ్చే డబ్బుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
'గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలేంటి' - demands
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై ఆధారాలు చూపిన సీఎం... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని భాజపా నేత మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.
మాణిక్యాలరావు