Farmer facing problems: అనంతపురం జిల్లా శింగనమల మండలం ఆనందరావుపేట గ్రామానికి చెందిన సంజప్ప అనే రైతు మండల సర్వేయర్ రిపోర్ట్ ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. భూమి కొలతల కోసం సంజప్ప దరఖాస్తు చేసుకోగా.. మండల సర్వేయర్ గోవిందరాజులు రైతు పొలంలో కొలతలు నిర్వహించాడు. కొలతలు వేసి మూడు నెలలు గడుస్తున్నా.. సర్వేయర్ రిపోర్ట్ ఇవ్వలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని.. కొలతలు నిర్వహించే సమయంలో తన దగ్గర రూ.50వేలు లంచం కూడా తీసుకున్నాడని రైతు వాపోయాడు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తహసీల్దార్‌కు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు కోరుతున్నాడు.
మూడు నెలలుగా సర్వేయర్ చుట్టూ రైతు.. అయినా - లంచం
Land Survey Report: ఓ రైతు తన పొలం కొలతల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు స్వీకరించిన సర్వేయర్ పొలం కొలతలు వేశాడు. కానీ, కొలతల రిపోర్ట్ రైతుకు అందించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. మూడు నెలలు గడిచినా రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని.. రూ.50 వేలు లంచం కూడా తీసుకున్నాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఇది ఎక్కడంటే..
సర్వేయర్ రిపోర్ట్ ఇవ్వడం లేదని రైతు ఆవేదన