రాజకీయ నాయకుల ఒత్తిళ్లు భరించలేక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులో వెళుతున్న ఘటన.. అనంతపురం జిల్లా తలుపుల మండలంలో జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది.. తమపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయంటూ జిల్లా పరిషత్ సీఈవో, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి తాము సామూహిక సెలవులపై వెళుతున్నామంటూ ఉన్నత అధికారులకు వినతి పత్రం అందజేశారు.
అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు.. సామూహిక సెలువులపై సిబ్బంది - అనంతపురం జిల్లా తాజా సమాచారం
రాజకీయ ఒత్తిళ్ల వల్ల తాము పనిచేయలేకపోతున్నామని అనంతపురం జిల్లా తలుపుల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది.. ఉన్నతాధికారుల వద్ద వాపోయారు. ఈ మేరకు తాము సామూహిక సెలవులపై వెళుతున్నామంటూ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తలుపుల మండల పరిషత్ కార్యాలయం