ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని... భర్త ఆత్మహత్యాయత్నం..! - latest news of husband suicide

భార్య కాపురానికి రావట్లేదని భర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన... అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటూరులో జరిగింది.

man suicide for wife at anathapur
భార్య కాపురానికి రాలేదని... భర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Dec 10, 2019, 11:53 AM IST

భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని, పలుమార్లు ప్రాధేయపడినా కాపురానికి రాలేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటూరుకు చెందిన నగేష్​కు... నాలుగేళ్ల కిందట నల్లచెరువు మండలానికి చెందిన యువతితో పెళ్లైంది. రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో... మనస్పర్థాలు వచ్చాయి.

నగేష్ భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను నిర్లక్ష్యం చేసింది. నగేష్ భార్యకు నచ్చజెప్పినా ఆమెలో మార్పురాలేదు. 3 నెలల కిందట కూతురుతో కలిసి నగేష్ భార్య పుట్టింటికి వెళ్ళింది. కాపురానికి రావాలని బతిమాలినా వినిపించుకోలేదు. మరోసారి అత్తారింటికి వెళ్ళిన నగేష్​కు భార్య కనిపించలేదు. దీంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పారు. కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నగేష్​ పరిస్థితి విషమంగా ఉంది.

భార్య కాపురానికి రాలేదని... భర్త ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details