ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీరు బాటిల్​లో పర్ఫ్యూమ్ స్ప్రే కలిపి... యువకుడు ఆత్మహత్యాయత్నం - anantapuram crime news

రూ.5 లక్షలు వెచ్చించి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించాడు. మరో లక్ష రూపాయలు అవసరం వచ్చాయి. తల్లిదండ్రులను అడగ్గా.. వారు నిరాకరించారు. మనస్థాపానికి గురైన అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

suicide
బీరు బాటిల్​లో పర్ఫ్యూమ్ స్ప్రే కలిపి.. యువకుడు ఆత్మహత్యాయత్నం

By

Published : Feb 14, 2021, 5:12 PM IST

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన బాబ్దీన్ అనే యువకుడు... బీరు బాటిల్లో పర్ఫ్యూమ్ స్ప్రే కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా జోళాపురానికి చెందిన జకీరాబీ, ఖాదర్ బాషా దంపతుల కుమారుడు బాబ్దీన్ కిష్టిపాడులో తన తాతయ్య దగ్గర ఉంటున్నాడు. నెల క్రితమే రాయలచెరువులో 5లక్షలు వెచ్చించి నూతనంగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించాడు.

దుస్తుల కొనుగోలుకు మరో లక్ష రూపాయలు ఇవ్వాలని తల్లిదండ్రులను అడగ్గా.. వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన బాబ్దీన్... బీరుబాటిల్లో పర్ఫ్యూమ్ స్ప్రే కలుపుకొని తాగాడు. అపస్మారక స్థితిలో పడిఉండటం గమనించిన స్మేహితులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:అనంతపురం జిల్లాలో రెండో విడత ఎన్నికలు విజయవంతం

ABOUT THE AUTHOR

...view details