ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల 'స్పందన' లేదంటూ... ఆత్మహత్యాయత్నం - గుమ్మగుట్ట తహసీల్దార్​ కార్యాలయం వద్ద బాధితుడు ఆత్మహత్యాయత్నం

గుమ్మగుట్ట తహసీల్దార్​ కార్యాలయంలో పురుగుల మందు తాగి జయరాంరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలానికి... గ్రామానికి చెందిన కొందరు అడ్డు తగిలారని బాధితుడు ఆవేదన చెందాడు. ఎంత తిరిగినా ఎవ్వరూ పట్టించుకోవడంలేదని సోమవారం ఆత్మహత్యాయత్నాం చేశాడు.

అధికారుల  'స్పందన' లేదంటూ ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 11, 2019, 8:43 PM IST

అధికారుల 'స్పందన' లేదంటూ ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తహసీల్దార్​ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయరాంరెడ్డి (36) కి రెండేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు ఇంటి స్థలం కింద రెండున్నర సెంట్లు కేటాయించారు. ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు అడ్డు తగిలారు. న్యాయం చేయాలంటూ బాధితుడు రెండేళ్లుగా తహసీల్దార్​ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు. విరక్తి చెందిన జయరాం రెడ్డి సోమవారం స్పందన కార్యక్రమానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఇలాంటి పనికి పాల్పడినట్లు భార్య పల్లవి ఆరోపించింది. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరింది. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని పోలీసులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details