ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చుక్కలూరులో దారుణం : వ్యక్తి దారుణ హత్య

అనంతపురం జిల్లా చుక్కలూరు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man murdered with mysterious in chukkalore thadipathri mandalam ananthapuram district
చుక్కలూరులో దారుణం : వ్యక్తి దారుణ హత్య

By

Published : Oct 8, 2020, 4:03 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామానికి చెందిన రమేష్ బాబు... భవన నిర్మాణ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రమేష్ బాబు అదృశ్యమయ్యాడు. ఘటనపై కుటుంబసభ్యులు తాడిపత్రి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో గ్రామంలోని ఓ తోట వద్ద మృతదేహం పూడ్చిపెట్టి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసి రమేష్ బాబుగా గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

24 గంటల్లో అల్పపీడనం.. కోస్తాంధ్ర, యానాంకు వర్ష సూచన

ABOUT THE AUTHOR

...view details