లిఫ్ట్‌లో ఇరుక్కొని వ్యక్తి మృతి - Elevator Accident at ananthapur
లిఫ్ట్‌లో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం పట్టణంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Man Killed in Freak
అనంతపురంలోని ఓ అపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కొని నర్సయ్య(51) అనే వ్యక్తి మృతి చెందాడు. నగరంలోని శారదానగర్‌లో ఉన్న అపార్ట్మెంట్లో పసలూరు గ్రామానికి చెందిన నర్సయ్య ప్రతిరోజు పాలు పోసేందుకు వచ్చేవాడు. ఎప్పటిలాగే ఇవాళ వచ్చి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మృతి చెందినట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.