అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలోని సౌర విద్యుత్తు ప్రాజెక్టులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన రిషికేశ్ చౌదరి అనే ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది... బాధితుడిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. రిషికేశ్ పరిస్థితి విషమంగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు - ananthapuram district latest news
విద్యుదాఘాతంతో.. ఓ ఉద్యోగికి తీవ్ర గాయాలైన ఘటన అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో జరిగింది. మెరుగైన చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
![విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు man injured with short circuit in nambulapoolakunta ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9612494-919-9612494-1605932363825.jpg)
షార్ట్ సర్క్యూట్తో ఉద్యోగికి తీవ్ర గాయాలు