చెత్తవేసే విషయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న గొడవతో విసుగు చెందిన ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి దూకేస్తానంటూ హడావిడి చేశాడు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన జైభీమ్ సంఘం కార్యకర్త నారాయణస్వామి.. పక్కింటిలో ఉండే విష్ణు అనే యువకుడి మధ్య కొన్ని రోజుల క్రితం చెత్త వేసుకునే విషయంలో గొడవ జరిగింది. దీంతో జైభీమ్ కండువా వేసుకోవద్దని విష్ణు తనను బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ నారాయణ స్వామి రాయలసీమ కూడలిలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. విష్ణుపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయని పక్షంలో టవర్‌పై నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. ఎస్సై మహమ్మద్ రఫి అతడితో మాట్లాడి కిందికి దింపారు.
పక్కింటి వ్యక్తితో గొడవ.. సెల్ టవర్ ఎక్కి.. హల్చల్... - today crime latest news update
అనంతపురం జిల్లా కదిరికి చెందిన జైభీమ్ సంఘం కార్యకర్త నారాయణస్వామి సెల్ టవర్ ఎక్కి దూకేస్తానంటూ హడావిడి చేశాడు. పక్కింటి వ్యక్తితో జరిగిన వివాదం కారణంగా మనస్తాపానికి గురైన నారాయణ స్వామి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు నచ్చజెప్పి అతడిని కిందకు దించారు.
సెల్ టవర్ ఎక్కి దూకేస్తానంటూ వ్యక్తి హడావిడి