ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సారా విక్రేత ఆత్మహత్యాయత్నం - man suicide at police station latest news

అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీస్ స్టేషన్​లో వెంకటేశ్ నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగినట్లు బాధితుడి బంధువులు తెలిపారు. సారా తయారు చేస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు.. పోలీసులు వెంకటేశ్ ను అరెస్ట్ చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

By

Published : Nov 9, 2019, 7:40 AM IST

Updated : Nov 9, 2019, 7:51 AM IST

అనంతపురం జిల్లాలో పోలీస్ స్టేషన్​లో పురుగుల మందు తాగిన సారా విక్రేత

అనంతపురం జిల్లాలోని కమలపాడు తండాకు చెందిన వెంకటేష్ నాయక్ గతంలో సారా విక్రయించేవాడు. ఇలాంటి వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు.. పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పలువురు తండావాసులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు... వజ్రకరూరు పోలీసులు వెంకటేష్ నాయక్​పై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేశారు. అనంతరం.. వెంకటేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులే ఇందుకు కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. బెయిల్ రాదని.. జీవితాంతం పోలీస్ స్టేషన్ లోనే గడపాలని పోలీసులు చెప్పిన కారణంగానే.. వెంకటేశ్ ఈ ప్రయత్నం చేశాడని చెప్పారు. ప్రస్తుతం వెంకటేశ్ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Last Updated : Nov 9, 2019, 7:51 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details