అనంతపురం జిల్లా తనకల్లు మండలం గణాదివారిపల్లిలో పాముకాటుతో రమణ అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి రమణ భోజనం చేసి నిద్రపోయాడు. నిద్రలో ఉండగా అతన్ని పాముకాటు వేసింది. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని కదిరిలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. రమణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
గణాదివారిపల్లిలో పాముకాటుతో వ్యక్తి మృతి - గణాదివారిపల్లిలో పాముకాటుతో వ్యక్తి మృతి
పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలం గణాదివారిపల్లిలో జరిగింది.
గణాదివారిపల్లిలో పాముకాటుతో వ్యక్తి మృతి