ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చికిత్స అందక వ్యక్తి మృతి.. వైద్యులపై చర్యలకు బంధువుల డిమాండ్ - అనంతపురం డాక్టర్ల నిర్లక్ష్యం

కరోనా ఉందనే అనుమానంతో ఓ రోగికి వైద్యం అందించడానికి వైద్యులు నిరాకరించారు. డోన్ ప్రాంతానికి చెందిన రఘురామయ్య.. అనారోగ్యంతో ఉన్న కారణంగా.. తమ బంధువులతో కలిసి రాత్రి రెండు గంటల సమయంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించగా.. సరైన సమయంలో వైద్యం అందక మృతి బాధితుడు చెందాడు.

man died with neglegency on ananthapur government hospital doctors
వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

By

Published : Jul 14, 2020, 5:06 PM IST

అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. డోన్ ప్రాంతానికి చెందిన రఘురామయ్య అనారోగ్యంతో ఉన్న కారణంగా.. తమ బంధువులతో కలిసి రాత్రి రెండు గంటల సమయంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. కరోనా ఉందనే అనుమానంతో వైద్యులు అతనికి చికిత్స చేయడానికి నిరాకరించారు.

ఈ కారణంగా.. ఇతర ఆసుపత్రులకు తిరగాల్సి వచ్చిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైద్యం అందక ఉదయం రఘురామయ్య మరణించినట్లు బంధువులు చెప్పారు. ఈ మరణానికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details