అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసపురం కాలనీకి చెందిన కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి... అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున కర్మాగారంలోని పంపు హౌస్ వద్ద విధులు నిర్వహిస్తుండగా... ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గమనించిన తోటి సిబ్బంది సూర్యనారాయణను అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు.. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సూర్యనారాయణ మృతి చెందాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి - తాడిపత్రిలో వ్యక్తి మృతి
విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి కూలీ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగింది. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ... మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేసేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు.
మృతుడు కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి