ఉపాధి లేకపోవటం, అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఓ కూలి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామానికి చెందిన వన్నూరు స్వామి (35)... ముంబయిలో కొన్ని సంవత్సరాలుగా కూలి పని చేస్తుండేవాడు. లాక్డౌన్ కారణంగా అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతను... ఇంటి వద్దే ఉంటూ చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కరోనా తెచ్చిన కష్టం... కూలి బలవన్మరణం - uravakonda madal latest news
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉపాధి దొరక్కపోవటం, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని మృతుని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

suicide
కరోనా సమయం నుంచి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువ కావటంతో అతను మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబసభ్యులు వెల్లడించారు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య బోరున విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. నలుగురు పిల్లలను ఎలా పోషించాలంటూ కన్నీరుమున్నీరైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.