అనంతపురం జిల్లా పుట్లూరు మండలం దొసలేడు గ్రామానికి చెందిన నారాయణస్వామి(35) అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య దూరం అయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పని లేకపోవడంతో ఖాళీగా ఉండి గతాన్ని తలుచుకుని వేదనకు గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. గమనించిన బంధువులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఒంటరితనం కారణంగానే ఇలా చేశాడని బంధువులు తెలిపారు
ఒంటరితనాన్ని భరించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం - man suicide news in anantapur dst
జీవితంలో మనిషికి మానిసిక ఆనందం ఎంతో అవసరం. అది లేనప్పుడు ఎన్ని ఉన్నా ప్రశాంతంగా బతకలేరు. ఒంటరితనం వేధించటంతో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం దొసలేడు గ్రామంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
man committed suicide attempt in anantapur dst