ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SELFIE SUICIDE: రైలు కిందపడి వైకాపా నాయకుడు ఆత్మహత్య...ఎందుకంటే..! - పుట్టపర్తిలో రైలు కిందపడి ఆత్మహత్య

పుట్టపర్తిలో దారుణం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ ఆదాం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైలు కింద పడి ఆత్మహత్య
రైలు కింద పడి ఆత్మహత్య

By

Published : Nov 4, 2021, 11:14 AM IST

రైలు కింద పడి ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ ఆదాం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఏమీ చేయలేకపోతున్నానని తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఏ ఒక్కరూ కారణం కాదని తనకు బ్రతకాలని ఆశ లేదని.. ఈ విషయంలో తన కుటుంబ సభ్యులను ఎవరూ ఏమీ అనొద్దని, విచారణ పేరుతో పోలీసులు నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టొద్దని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఆయన మృతదేహాన్ని.. రైల్వే పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

కేంద్రం తరహాలో పెట్రోల్, డీజిల్​పై పన్నుల బాదుడు తగ్గించేదెప్పుడో..: లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details