అనంతపురం బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మవరానికి చెందిన కన్నా అనే వ్యక్తి అనంతపురంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే మద్యానికి బానిసై తరచూ తనతో గొడవ పడేవాడని... మృతుడి భార్య తెలిపింది. మద్యం మత్తులో మిత్రులే హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతలో వ్యక్తి దారుణ హత్య - అనంతపురం జిల్లా ఈరోజు క్రైమ్ తాజా వార్తలు
అనంతపురంలో ధర్మవరానికి చెందిన వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపింది. మద్యం మత్తులో స్నేహితులే హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఆరోపిస్తోంది.
అనంతలో వ్యక్తి దారుణ హత్య