అనంతపురంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ధనుంజయ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారు ప్రాంతమైన చంద్రబాబు కాలనీలో అక్రమంగా మద్యం నిల్వ ఉన్నట్లు సమాచారం రావటంతో నాలుగో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ధనుంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. అతని నుంచి 20 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ మద్యం అమ్మకానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాలనీ ప్రజలకు పోలీసులు హెచ్చరించారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు