ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మపురి అటవీ ప్రాంతంలో నెమలిని చంపిన వ్యక్తి అరెస్ట్ - peacock murder in anantapur

నెమలిని చంపిన కేసులో వెంకటేశులు అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి.వీరాపురం సమీపంలోని ధర్మపురి అటవీ ప్రాంతంలో జరిగింది.

నెమలిని చంపిన వ్యక్తి అరెస్ట్
నెమలిని చంపిన వ్యక్తి అరెస్ట్

By

Published : Sep 7, 2020, 5:04 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ధర్మపురి అటవీ ప్రాంతంలో నెమలిని చంపిన కేసులో వెంకటేశులు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వీఆర్ఓ శ్రీరాములు తెలిపారు. నిందితుడు గుమ్మగట్ట మండలం బేలోడుకు చెందిన వెంకటేశులుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ఇదీ జరిగింది

ఆదివారం ఉదయం రాయదుర్గం, కనేకల్ ఆర్ అండ్ బి రహదారిలో అటవీశాఖాధికారులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ధర్మపురి ఫారెస్ట్​లో బైక్​పై వస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నారు. అతని వద్ద నెమలి మాంసం దొరికినట్లు అధికారులు తెలిపారు. తనను విచారించగా అటవీ ప్రాంతంలో నెమలి చనిపోవటంతో రెక్కలు, ఈకలు తొలగించి మాంసాన్ని తీసుకువెళ్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ఘటనస్థలాన్ని పరిశీలించిన పోలీసులు నెమలి మాంసాన్ని ఆవులదట్ల వెటర్నరీ వైద్యునితో పోస్టుమార్టం చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించారు.

ఇవీ చదవండి

గోదాముల్లోనే పుస్తకాలు.. సందేహాల నివృత్తి ఎలా?

ABOUT THE AUTHOR

...view details