అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నహైదరాబాద్లోని మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అరెస్టు చేసిన అధికారులు... ఇవాళ అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నర్సింహారెడ్డికి సంబంధించిన ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు లాకర్లను అనిశా అధికారులు తెరవనున్నారు. అతని అక్రమాస్తులపై ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లిలో విచారణ జరిపారు. వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో హైదరాబాద్‌తో పాటు వరంగల్, జనగాం కరీంనగర్, నల్గొండ, రాష్ట్రంలోని అనంతపురంలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సింహారెడ్డి గతంలో ఉప్పల్, మియాపూర్‌లో సీఐగా పనిచేశారు. పలు భూవివాదాల్లో తలదూర్చి రాజీ చేసినట్టు నర్సింహారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీపీ నర్సింహారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై నిఘా పెట్టిన అనిశా అధికారుల దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని అతని నివాసంతో పాటు అతని స్నేహితులు, బంధువులు, బినామీల ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకూ రూ.70కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది.
ఆంధ్రాలోనూ ఆస్తులు