అనంతపురంలోని నగర శివారులోని కళ్యాణదుర్గం రోడ్డు పిల్లిగుండ్ల కాలనీలో వరలక్ష్మి, ఎర్రిస్వామి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బేల్దారి పని చేసుకుంటూ వీరు జీవనం సాగించేవారు..
HUSBAND KILLED WIFE: మద్యం వద్దన్నందుకు.. భార్యను హత్య చేసిన భర్త - ఆంధ్రప్రదేశ్ వార్తలు
మద్యం తాగొద్దని మందలించినందుకు భార్యనే హత్య చేశాడు ఓ తాగుబోతు.. అనంతపురంలోని నగర శివారులోని కళ్యాణదుర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త
కూలీ డబ్బులన్నీ మద్యానికే ఖర్చు చేస్తుండడంతో తరచూ భార్య ఎర్రిస్వామితో గొడవ పడేది. అర్ధరాత్రి వరకు మద్యం తాగుతుంటే కూలీ డబ్బులు మొత్తం మద్యానికి ఖర్చు చేస్తున్నావని భార్య వరలక్ష్మి మందలించింది. దీంతో ఆగ్రహనికి గురైన ఎర్రిస్వామి పక్కనే ఉన్న సుత్తితో వరలక్ష్మిపై దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: