అనంతపురం జిల్లాలో మహాత్ముని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మడకశిరలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో ర్యాలీ నిర్వహించారు ఈ ప్రదర్శనలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు.
స్వచ్ఛతను పాటిస్తూ, పాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమాలను చేపడతామని కదిరి మున్సిపల్ అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జాతిపిత జయంతిని పురస్కరించుకుని పట్టణములో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, విరివిగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను పట్టణవాసులకు వివరించారు. నేటి నుంచి పట్టణంలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలులోకి తీయనున్నట్లు కమిషనర్ ప్రమీల తెలిపారు.